: రాష్ట్రానికి వచ్చింది డ్రాఫ్ట్ బిల్లేనని కేంద్ర హోం శాఖే చెప్పింది: కిరణ్


తాను అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు ఎంత మద్దతుందో భవిష్యత్తులో చూస్తారని ముఖ్యమంత్రి కిరణ్ చెప్పారు. పార్లమెంటుకు బిల్లు వెళ్లే ముందు లీగల్ గా అన్ని విషయాలు చూస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్చ ఉందని... అందుకే తాను కాంగ్రెస్ లో ఉన్నానని చెప్పారు. అసెంబ్లీకి పంపిన బిల్లులో ఆర్థిక అంశాలు, కారణాలు, వివరాలు ఏమీ లేవని ఎద్దేవా చేశారు. బిల్లు పార్లమెంటుకు వెళ్తుందో, లేదో మరో 20 రోజుల్లో తెలుస్తుందని అన్నారు. ఇది డ్రాఫ్ట్ బిల్లు అని... అందుకే వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ చెప్పిందని కిరణ్ తెలిపారు. బిల్లుపై అభిప్రాయాలు చెప్పాలనుకున్నవారు చెప్పారని, చెప్పకూడదు అనుకున్న వారు చెప్పలేదని... చంద్రబాబును ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News