: రాష్ట్ర స్థాయి అవినీతి నేతల చిట్టా విప్పనున్న ఏఏపీ
ఇప్పటికే అవినీతి జాతీయ స్థాయి నేతల పేర్లను వెల్లడించిన ఆమ్ ఆద్మీ పార్టీ... ఇక రాష్ట్రాలపై దృష్టి సారించింది. త్వరలోనే రాష్ట్రాల వారీగా అవినీతి నేతల పేర్లను వెల్లడిస్తామని ప్రకటించింది. తొలుత మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లోని అవినీతి రాజకీయ నాయకుల పేర్లను ప్రకటిస్తామని ఏఏపీ నేత సుభాష్ వారె తెలిపారు.