: కరుణానిధి డిమాండ్లను అధిష్ఠానానికి నివేదిస్తాం: కేంద్ర మంత్రులు


శ్రీలంక వ్యవహారంలో కటువుగా వ్యవహరించాలని, లేకుంటే యూపీఏకి మద్దతు ఉపసంహరిస్తామని హెచ్చరిస్తున్న డీఎంకే అధినేత కరుణానిధిని బుజ్జగించేందుకు కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. ఈ సాయంత్రం వారు చెన్నైలో కరుణానిధితో సమావేశమయ్యారు.

ఆజాద్, చిదంబరం, ఆంటోనీ పాల్గొన్న ఈ అత్యవసర సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది. భేటీ అనంతరం ఆజాద్ మీడియాతో మాట్లాడారు. కరుణానిధితో చర్చించిన విషయాలను కాంగ్రెస్ హైకమాండ్ కు నివేదిస్తామని ఆయన తెలిపారు.

కాగా, త్వరలోనే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో లంక దురాగతాలకు వ్యతిరేకంగా అమెరికా తీర్మానం ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ బిల్లుకు భారత్ మద్దతివ్వడమే కాకుండా.. లంకపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా ఐరాస సమావేశంలో వ్యవహరించాలని కరుణానిధి పట్టుబడుతున్నారు. 

  • Loading...

More Telugu News