: ఎల్ కేజీ నుంచి కిరణ్ అబద్ధాలే చెబుతున్నారు: ఎంపీ వివేక్


ముఖ్యమంత్రి కిరణ్ ఎల్ కేజీ చదువుకునేటప్పటి నుంచి అబద్ధాలే చెబుతున్నారని పెద్దపల్లి ఎంపీ వివేక్ చెప్పారు. తాను, కిరణ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లో ఎల్ కేజీ నుంచి క్లాస్ మేట్స్ అని తెలిపారు. కిరణ్ ఆడిన ఎన్నో తొండి ఆటలను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కొత్తగా తెలంగాణపై కూడా అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. ఈ రోజు మెదక్ లో మీడియాతో వివేక్ మాట్లాడారు. విభజన బిల్లుకు సంబంధించి కిరణ్ వైఖరిపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులుగా వివేక్ ఈ విధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News