: 26 కాంగ్రెస్ ఓట్లు నావే: ఆదాల
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అదనంగా ఉన్న 26 మంది ఎమ్మెల్యేల ఓట్లు తనకే పడతాయని రెబెల్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆనం వివేకానందరెడ్డిని ఓ పగటి వేషగాడిగా పేర్కొన్నారు. ఆయన బెదిరింపులకు తానేమీ భయపడనని, వివేకానందరెడ్డిని కేవీపీయే వెనక ఉండి నడిపిస్తున్నారని మండిపడ్డారు.