: వెంకయ్యనాయుడితో పయ్యావుల భేటీ
అనంతపురంలో జరిగిన నమో చాయ్ కార్యక్రమానికి హాజరైన బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడితో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. రాష్ట్రం రెండు ముక్కలైతే అనంతపురం జిల్లాకు జరిగే నష్టాన్ని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడి దృష్టికి కేశవ్ తీసుకొచ్చారు. సీమాంధ్రులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని వెంకయ్యనాయుడు చెప్పారని కేశవ్ తెలిపారు.