: ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల కలకలం
మావోయిస్టులు మరోసారి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ఖమ్మం జిల్లా దుమ్మగూడెం మండలం ఆర్లగూడెంలో సెల్ టవర్ ను పేల్చివేశారు. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం పెద్దగా లేదని, మున్ముందు కూడా వారిని పూర్తి స్థాయిలో అరికడతామని ఎస్పీ రంగనాథ్ నిన్న ప్రకటించారు. అయితే 24 గంటల్లోపే మావోలు చెలరేగిపోవడం గమనించదగ్గ అంశం.