: అనంతపురంలో వెంకయ్యనాయుడు నమో చాయ్ ప్రచారం
చాయ్ అమ్మేవాడు ప్రధాని కావచ్చని.. కానీ, దేశాన్ని అమ్మేవాడు ప్రధాని కాకూడదని బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు అన్నారు. అనంతపురంలో ఈ రోజు జరిగిన నమో చాయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి మాటలు తప్ప చేతలు తెలియవన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు పలువురికి చాయ్ పంపిణీ చేశారు.