: సినీ ఫంక్షన్లపై లోకాయుక్తకు ఫిర్యాదు
'బాద్ షా' ఆడియో రిలీజ్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఒకరు మరణించిన నేపథ్యంలో సినీ ఫంక్షన్ల నిర్వహణపై లోకాయుక్తలో ఫిర్యాదు నమోదైంది. వేడుకల నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు సంభవిస్తున్నాయంటూ.. హైకోర్టు న్యాయవాది సోమరాజు నేడు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు.
హైదరాబాదులో ఆదివారం సాయంత్రం రామానాయుడు స్టూడియోలో జరిగిన 'బాద్ షా' చిత్ర గీతాల విడుదల కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో వరంగల్ జిల్లా వాసి రాజు మృతి చెందిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమ పెద్దలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సోమరాజు అభిప్రాయపడ్డారు.