: అనంతపురంలో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన రఘువీరా
రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వో పరీక్షలు ప్రారంభమయ్యాయి. అనంతపురంలో పరీక్షను నిర్వహిస్తున్న ఆర్ట్స్ కళాశాలకు వెళ్లి మంత్రి రఘువీరారెడ్డి తనిఖీ చేశారు. 25 వేల మంది పోలీసులతో రాష్ట్రంలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులను అభినందించారు. నెలాఖరులోగా ఫలితాలను వెల్లడిస్తామని.. ఎవరూ దళారులను ఆశ్రయించవద్దని కోరారు. నంద్యాలలో మాస్ కాపీయింగ్ బయటపడిందని, నిందితుడు గురివిరెడ్డిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.