: నేడే వీఆర్వో, వీఆర్ఏ పరీక్ష: అన్ని ఏర్పాట్లు పూర్తి
ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగాల ఎంపిక పరీక్ష ఈ రోజు జరుగుతుంది. వీఆర్వో ఉద్యోగానికి 13,49,244 మంది, వీఆర్ఏ ఉద్యోగానికి 1,00,575 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేశారు. వీఆర్వో పరీక్షను 3684 కేంద్రాల్లో, వీఆర్ఏ పరీక్షను 195 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. కాగా ఈ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వీఆర్వో పరీక్ష ఈ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు, వీఆర్ఏ పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటలవరకు జరుగుతుంది. ఈ పరీక్షలకు సంబంధించి ప్రాధమిక కీ ని ఫిబ్రవరి 4న, తుది కీ ని ఫిబ్రవరి 10న, ఫలితాలను ఫిబ్రవరి 20న వెల్లడిస్తారు. ఫిబ్రవరి 26 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించి, ఈ నెలాఖరులోపు ఉద్యోగ నియామకాలు చేస్తారు.