: కిరణ్ ను అధిష్ఠానమే నడిపిస్తోంది: ఎర్రబెల్లి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానమే నడిపిస్తోందని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. వరంగల్ లో ఆయన మాట్లాడుతూ.. స్పీకర్, ముఖ్యమంత్రి తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే ఇక్కడి మంత్రులు తక్షణం పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.