: జగన్ ను వద్దనుకున్న వారే పార్టీ నుంచి వెళుతున్నారు: శోభానాగిరెడ్డి
వరుసగా వైఎస్సార్సీపీని వీడుతూ, తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఆ పార్టీ నేత శోభానాగి రెడ్డి స్పందించారు. తమ అధినేత జగన్ ను వద్దనుకున్న వారే పార్టీ నుంచి బయటికి వెళుతున్నారన్నారు. అలా వెళ్లే వారివల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఆమె చెప్పారు. అయితే, బయటికి వెళ్లాక పార్టీపై బురద చల్లడం క్షమించరాని నేరమని ఆమె అన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఈ రోజు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 31 మంది కేంద్ర కార్యవర్గ సభ్యులకు.. 20 మంది మాత్రమే హాజరు కావడం గమనార్హం.