: మరోసారి పోలీసులకు పట్టుబడ్డ గురివిరెడ్డి ముఠా
మాస్ కాపీయింగ్ స్పెషలిస్ట్ గురివిరెడ్డి ముఠా మరోసారి రంగంలోకి దిగింది. వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు వల విసిరింది. బ్లూటూత్ ద్వారా సమాధానాలు చెబుతామని, బ్లూటూత్ లు కూడా అత్యాధునికమైనవని చెబుతూ, డబ్బులు వసూలు చేశారు. దీనిపై కర్నూలు పోలీసులు కేసులు నమోదు చేసి గురివిరెడ్డి ముఠాలోని 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఎమ్ సెట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతూ గురువిరెడ్డి పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే.