: విజయనగరం జిల్లాలో వీఆర్వో, వీఆర్ఏ పరీక్షకు 47 వేల మంది..


విజయనగరం జిల్లాలో వీఆర్వో రాత పరీక్షకు 44,203 మంది, వీఆర్ఏ పరీక్షకు 2,800 మంది రాస్తున్నారని ఇంచార్జి జాయింట్ కలెక్టర్ యుసీజీ నాగేశ్వరరావు మీడియాకు తెలిపారు. ఇందుకోసం విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, జామి, బొండపల్లి, గరివిడి, గజపతినగరం ప్రాంతాల్లో 168 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వీఆర్వో రాతపరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వీఆర్ఏ పరీక్ష జరుగుతుందని ఆయన అన్నారు. అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా హాలులోనికి అనుమతించడం జరగదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News