: వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించం
ఆదివారం నిర్వహించనున్న వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి గంట ముందుగా అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని వారు చెప్పారు. పరీక్షలను ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా హాల్ టిక్కట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు చెప్పారు. అభ్యర్థి తనతో పాటు హాల్ టిక్కెట్, బాల్ పాయింట్ పెన్ను, పెన్సిల్ మాత్రమే తెచ్చుకోవాలని వారు తెలిపారు. సెల్ ఫోన్లు, కేలిక్యులేటర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించేది లేదని వారు స్పష్టం చేశారు. హాల్ టిక్కెట్ పై ఫోటో గానీ, అభ్యర్థి సంతకం గానీ గజిబిజిగా ఉన్నా, సరిగా కనపడకపోయినా ఒక తెల్ల కాగితంపై అభ్యర్థి మూడు సంతకాలు చేసి, ఫోటో అతికించి దానిపై గెజిటెడ్ అధికారిచే ధృవీకరించుకొని పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్ కు అందించాలని వారు సూచించారు.