: మూడు రోజుల పాటు బంధించి, సామూహిక అత్యాచారం!
కీచక వారసులకు ఏ రకమైన చట్టాలతో శిక్షలు విధించాలో అర్థం కావడం లేదు. సమాజంలో ఉగ్గుపాలతో నేర్పిన సంస్కారం ఎటు పోతోందో తెలియడం లేదు. కామాంధుల కబంధ హస్తాల నుంచి మహిళలను ఎలా రక్షించొచ్చో తెలియని దుస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్ లోని మావానా ప్రాంతానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలిక బుధవారం మార్కెట్ కు వెళ్లింది. మార్కెట్ నుంచి ఇంటికి వస్తున్న బాలికను ఐదుగురు యువకులు బలవంతంగా ఇంచులై అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి రబ్బర్ ట్యూబ్ తో కట్టిపడేశారు.
తరువాత మత్తు మందిచ్చి ఒకరి తరువాత ఒకరుగా మూడు రోజుల పాటు నరకం చూపించారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలికను శుక్రవారం ఆమె ఇంటి సమీపంలో విడిచిపెట్టారు. స్పృహలోకి వచ్చిన బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు.
బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్థారించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన అంజాద్ సహా నలుగురిపై కేసులు నమోదు చేశారు. అత్యాచారానికి ముందు అంజాద్ తనను తీవ్రంగా దూషించినట్టు బాలిక తెలిపింది. వారిలో ముగ్గురిని అరెస్టు చేయగా, మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.