: ఈ నెల 3న శాసనసభ్యులతో చలో ఢిల్లీ కార్యక్రమం: టీజీ వెంకటేష్
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 3న సీమాంధ్ర ఎమ్మెల్యేలతో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రపతిని కలసి బిల్లును పంపిన తీరును వివరిస్తామని కర్నూలులో మీడియాకు చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి గండికొట్టేలా ఎంపీలు వ్యవహరిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు.