: ఆదివారం నాడు ఇడుపులపాయలో వైఎస్సార్సీపీ రెండో ప్లీనరీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో ప్లీనరీ సమావేశం ఫిబ్రవరి రెండో తేదీ, ఆదివారం నాడు ఇడుపులపాయలో నిర్వహించనున్నారు. ఈ ప్లీనరీ (ప్రజాప్రస్థానం) సమావేశంలో పార్టీ అధ్యక్షుడి ఎన్నికతో పాటు ఇతర సంస్థాగత కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తారు. ఇందులో భాగంగా ఇవాళ (శనివారం) మధ్యాహ్నం పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు సమావేశమవుతున్నారు. వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో సమావేశానికి సంబంధించి ప్లీనరీ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్లీనరీ ఏర్పాట్లను పార్టీ కన్వీనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కడప జిల్లా కన్వీనర్ సురేష్ బాబు పర్యవేక్షిస్తున్నారు.