: ఉద్యమాన్ని అణచివేసింది కిరణ్ కాదా?: దాడి సూటి ప్రశ్న
ఉవ్వెత్తున ఎగసి పడిన సమైక్య ఉద్యమాన్ని అణచివేసింది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాదా? అని వైఎస్సార్సీపీ నేత దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ, సమైక్య హీరో అనిపించుకోవాలని ఉబలాటపడుతూ ముఖ్యమంత్రి సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సోనియాగాంధీ కనుసన్నల్లో రాజకీయం చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డే సమైక్య విలన్ అని ఆయన అభిప్రాయపడ్డారు.