: 'భారతీయ పాఠకుల సర్వే' లోపాలమయం: మీడియా సంస్థల ఆరోపణ
భారతీయ పాఠకుల సంఖ్య (ఐఆర్ఎస్) సర్వే తప్పుల తడక అని, లోపాలమయమని 18 ప్రముఖ మీడియా సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. 2013 ఏడాదికి సంబంధించి ఐఆర్ఎస్ విడుదల చేసిన గణాంకాలను ద హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, సాక్షి, జాగరణ్, భాస్కర్, ఇండియా టుడే, లోక్ మత్, అవుట్ లుక్, ద స్టేట్స్ మ్యాన్, దినకరణ్ తదితర సంస్థలు తప్పుబట్టాయి. ఆ గణాంకాల్లో ఎన్నో అసత్యాలు ఉన్నాయని, ప్రకటనదారులు వాటిని అనుసరించవద్దని కోరాయి. ఆయా సంస్థలు ఇందుకు కొన్ని ఉదాహరణలను పేర్కొన్నాయి.
బిజినెస్ లైన్ అనేది ద హిందూ గ్రూపునకు చెందిన వ్యాపార వార్తా పత్రిక. అయితే, దీనికి చెన్నైలో వలే మణిపూర్ లో మూడు రెట్లు పాఠకులు పెరిగారట. ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ ప్రముఖ పత్రిక 30 నుంచి 65శాతం పాఠకులను కోల్పోయిందట. ఏబీసీ ప్రకారం పత్రికల సర్కులేషన్ పెరుగుతోంది. దీనికి విరుద్ధంగా పాఠకులు పడిపోయారని ఐఆర్ఎస్ పేర్కొంది. ముంబైలో ఇంగ్లిష్ పాఠకులు 20 శాతం పెరిగితే, ఢిల్లీలో 19.5శాతం తగ్గిపోయారట. ఇలాంటివే మరికొన్ని చిత్రమైనవీ ఉన్నాయి!