: లీటరుకు 2 రూపాయలు పెరిగిన పాల ధర
పాల ధరను లీటరుకు రెండు రూపాయలు పెంచుతున్నట్లు విజయ డెయిరీ అధికారులు వెల్లడించారు. ఈ ధరలు ఫిబ్రవరి 2వ తేదీ, ఆదివారం నుంచి అమలులోకి వస్తాయని వారు తెలిపారు. దీనితో.. లీటరు 34 రూపాయలుగా వున్న పాల ధర రూ.36 కు చేరింది. కార్డుదారులకు మాత్రం ఫిబ్రవరి 11వ తేదీ నుంచి కొత్త ధరలు అమలు అవుతాయని అధికారులు చెప్పారు.