: భుజానికి ఈ బ్యాగుంటే.. మొబైల్ చార్జింగ్ సమస్యకు బైబై!
ప్రయాణంలో రెండు తప్పనిసరిగా ఉంటాయి. ఒకటి భుజానికి బ్యాగు. మరొకటి చేతిలో మొబైల్. కానీ, సుదూర ప్రయాణమైతే.. తీరిక లేకుంటే.. మొబైల్లో చార్జింగ్ సమస్య తప్పదు. అయితే ఆ చార్జింగ్ సదుపాయం ఏదో బ్యాగులోనే ఉంటే! బెంగళూరుకు చెందిన గౌరవ్ భక్షి(30)కి ఇదే ఆలోచన వచ్చింది. అంతే సూర్యరశ్మి సాయంతో చార్జింగ్ కు వీలు కల్పించే బ్యాగును తయారు చేశాడు. దీనిపేరు ల్యూమోస్ బ్యాగు. ఒక్క మొబైలే కాదు, ట్యాబ్లెట్లు, ఇతర పరికరాలను కూడా చార్జ్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా మీరేం చేయక్కర్లేదు. బ్యాగులో గాడ్జెట్ పెడితే చాలు.. అదే చార్జ్ అవుతుంది. వర్షంలో తడవకపోవడం ఈ బ్యాగు ప్రత్యేకత. కాకపోతే ధర కాస్త ఎక్కువే. రూ.5వేలు!