: వీవీఎస్ లక్ష్మణ్ ఖాతాలో 10 లక్షలు కొట్టేసిన నిందితుడి అరెస్టు
క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ఈ మెయిల్ ను హ్యాక్ చేసి 10 లక్షల రూపాయలు కొట్టేసిన కేసులో నిందితుడ్ని కోల్ కతా సాల్ట్ లేక్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అకౌంటు నుంచి తస్కరించిన మొత్తంలో 45 వేల రూపాయలు ఏటీఎం ద్వారా డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు. వీవీఎస్ ఫిర్యాదు చేసిన 24 గంటల్లోపే సైబరాబాదు పోలీసులు కేసును ఛేదించడం విశేషం!