: కుక్క మొరిగితే నేరస్థుడేనా?


పోలీసులు బాధ్యతారాహిత్యంతో దర్యాప్తు సాగిస్తే ఏమవుతుందో ఈ కేసు ఒక ఉదాహరణ. మహారాష్ట్రలోని సోలాపూర్ లో పదేళ్ల క్రితం జరిగిన జంట హత్యల కేసులో రాజారామ్ బాబర్ అనే వ్యక్తిని పోలీసులు అప్పట్లోనే అరెస్ట్ చేశారు. బాబరే ఆ హత్యలను చేశాడని తేలుస్తూ చార్జ్ షీటు దాఖలు చేశారు. వారు చూపించిన సాక్ష్యం ఏంటో తెలుసా? నిందితులను వరుసగా నుంచోబెడితే.. పోలీసు శునకం రాజారామ్ బాబర్ ను చూసి మొరిగిందట. దాంతో బాబరే నేరస్థుడని పోలీసులు డిసైడైపోయారు. కింది కోర్టు అతడికి జీవితఖైదు కూడా విధించింది. దీనిపై బాంబే హైకోర్టు ముందుకు ఒక పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ కేసులో బాబర్ కు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యాధారం కూడా లేదని జస్టిస్ పీవీ హర్ దాస్, జస్టిస్ అజయ్ గడ్కరీతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. రాజారామ్ పై మరే ఇతర కేసు విచారణలో లేకుంటే అతడిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News