: వైఎస్సార్సీపీతో దోస్తీకి సీపీఎం సిద్ధం


రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీతో తో పొత్తు దిశగా సీపీఎం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రకాష్ కారత్ సంకేతాలిచ్చారు. ఈ రోజు హైదరాబాదులో జరుగుతున్న సీపీఎం పార్టీ కార్యక్రమానికి హాజరైన ఆయన కాసేపు మీడియాతో ముచ్చటించారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో మూడో కూటమిని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. వైసీపీని కాంగ్రెసేతర సెక్యులర్ పార్టీగా చూస్తున్నామని కారత్ చెప్పారు. అయితే, జగన్ పై ఏఏపీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన అవినీతి ఆరోపణలపై... స్పందించలేనని స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తుకు అవకాశం లేకపోవడంతో... వైకాపా వైపు సీపీఎం వెళుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News