: త్వరలో గాళ్ ఫ్రెండుతో ఆండీ ముర్రే వివాహం
బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే త్వరలో తన ప్రియురాలు కిమ్ సియర్స్ ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ (జూన్ 23-జులై 6) ముగిశాక తమ పెళ్లి జరుగుతుందని వెల్లడించాడు. మూడు రోజుల కిందట ట్విట్టర్లో చాటింగ్ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు 26 యేళ్ల ముర్రే ఈ విషయాన్ని తెలిపాడు. 2005లో ముర్రే, కిమ్ మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమకు దారి తీసింది. అప్పటినుంచి ముర్రే ఆడే ప్రతి మ్యాచ్ కు కిమ్ హాజరై ప్రొత్సహిస్తోంది.