: కాశ్మీర్ మళ్లీ కళకళ..


గత కొద్ది రోజుల క్రితం వరకు నిరసనలు, హింస, ఉగ్రవాద దాడితో అట్టుడికిన కాశ్మీర్ లో ఇప్పుడిప్పుడే సాధారణ జనజీవనం నెలకొంటోంది. రాజధాని శ్రీనగర్ తో పాటు అన్ని ప్రధాన పట్టణాల్లోనూ జనసంచారం మామూలు స్థాయికి చేరుకుంది.

గతకొంత కాలంగా మూతపడి ఉన్న పాఠశాలలు, వ్యాపార సముదాయాలు తిరిగి తెరుచుకున్నాయి. బ్యాంకులు, కార్యాలయాలు, మార్కెట్లు తమ కార్యకలాపాలు ఆరంభించాయి. పార్లమెంటు దాడి కేసు నిందితుడు ఆఫ్జల్ గురు ఉరితీత అనంతరం కాశ్మీర్ లో తీవ్ర స్థాయిల్లో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. వాటిలో కొందరు మరణించడంతో ఆ అల్లర్లు మరింత విస్తరించాయి.

దీనికి తోడు బెమినా వద్ద సీఆర్పీఎఫ్ శిబిరంపై హిజ్బుల్ ముజాహిదిన్ దాడిలో ఐదుగురు జవాన్లు మరణించడం కాశ్మీర్ ను ప్రశాంత వాతావరణానికి దూరం చేసింది. ఇదిలావుంటే, అఫ్జల్ గురు మృత దేహాన్ని వారి బంధువులకు అప్పగించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఎంఎంఎం పార్టీ హెచ్చరిస్తుండడం అక్కడి ప్రజల్లో మళ్లీ భయాన్ని రేకెత్తిస్తోంది. 

  • Loading...

More Telugu News