: ఫేస్ బుక్ లో అమ్మాయి ముసుగులో 600 మందికి వల!


ఫేస్ బుక్ లో ఘరానా మోసాలకు అంతులేకుండా పోతోంది. అమ్మాయిలను ట్రాప్ చేసేవాళ్లు కొందరున్నట్టే అబ్బాయిలను ట్రాప్ చేసే వారు కూడా కొందరుండడం విశేషం. తాజాగా కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం అంబారీపేటకు చెందిన తిరుపతి(32) దుబాయ్ లో ఉంటున్నాడు. అమ్మాయిల పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు ఓపెన్ చేసి సుమారు 601 మందిని బురిడీ కొట్టించాడు. బాధితులు కొందరు జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదులో తమను రెచ్చగొట్టేలా అశ్లీల ఫోటోలు, వీడియోలు, అశ్లీల మెసేజ్ లు పెట్టి బలహీనతకు ఎరవేసేవాడని, ఆ తరువాత కొన్ని రోజులకు తాను ఆపదలో వున్నాను, సహాయం చేయండి అంటూ, తన బ్యాంకు అకౌంట్ లో వేల రూపాయలు వేయించుకునే వాడు. ఇతని బారిన కొందరు ప్రముఖులు కూడా పడినట్టు సమాచారం.

కాగా, ఇతను 72 మందితో రెగ్యులర్ ఛాట్ లో పాల్గోవడం విశేషం. ఈ ఘరానా మోసగాడిని స్వదేశానికి రప్పించేందుకు కోరుట్ల పోలీసులు తీవ్ర యత్నాలు చేస్తున్నారు. కానీ అతను తప్పించుకుంటున్నట్టు సమాచారం. అతను స్వదేశానికి వస్తే తప్ప విచారణ ముందుకు సాగడం కష్టం!

  • Loading...

More Telugu News