: టీడీపీ కూడా సమైక్యవాద పార్టీయే: జేసీ
సమైక్యవాదాన్ని ఢిల్లీ వరకు వినిపించేందుకే ఆదాల రాజ్యసభ బరిలో నిలిచారని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ఆదాల పోటీలో నిలబడినంత మాత్రాన కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోరని అన్నారు. సమైక్యవాదుల జోలికి మేమెవరం వెళ్లమని తెలిపారు. రెబల్స్ కు మద్దతు ఇచ్చే వారిపై చర్యలుంటాయన్న దానిపై స్పందిస్తూ... ప్రతి ఒక్కరికీ మన:సాక్షి ఉంటుందని చెప్పారు. టీడీపీ కూడా సమైక్యవాద పార్టీయే అని వెల్లడించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగో అభ్యర్థిని రాజ్యసభ బరిలో నిలపకుండా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎవరు ఓడిపోతారో చెప్పలేమని అన్నారు.