: జైపాల్ రెడ్డి వ్యాఖ్యలకు సోమిరెడ్డి రిటార్ట్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పెట్టిన తీర్మానం తొండిదన్న కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ తీర్మానం తొండిదైతే, పునర్వ్యస్థీకరణ మొండి బిల్లు అని వ్యాఖ్యానించారు. జైపాల్ రెడ్డి ఇటలీ గాంధీకి దాసోహమయ్యారని ఆరోపించారు. పార్లమెంటులో లోక్ పాల్, ఆహార భద్రత బిల్లులను మూజువాణి ఓటుతోనే ఆమోదించారని సోమిరెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ వారికి తెలుగువారంటే చిన్న చూపన్నారు. సభాపతులను విమర్శించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పారు.