: బీజేపీలో చేరిన రఘురామ కృష్ణరాజు


వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన రఘురామ కృష్ణరాజు బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సీమాంధ్రలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. మరింత మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. రఘురామ కృష్ణరాజుకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 4నుంచి పలు సమావేశాలు నిర్వహించి, రానున్న ఎన్నికలకు సిద్ధమవుతామని తెలిపారు. ఫిబ్రవరి 3న అన్ని జిల్లాల నేతలతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ఇరు ప్రాంతాలకు న్యాయం జరగాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News