: త్వరలో లోకేష్ రాష్ట్రవ్యాప్త సైకిల్ యాత్ర


తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించనున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో.. టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సైకిల్ యాత్రను చేపట్టనున్నారు. పార్టీ గుర్తు అయిన సైకిల్ పైనే ఆయన రాష్ట్రమంతటినీ చుట్టిరావాలనే ప్రణాళికతో ఉన్నారు. ఫిబ్రవరి రెండో వారంలో తిరుపతి లేదా అనంతపురం నుంచి లోకేష్ సైకిల్ యాత్ర ప్రారంభం కానున్నట్లు సమాచారం. భద్రత, అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఆయన తన ప్రచారంలో చాటి చెప్పాలనుకుంటున్నారు. చంద్రబాబును తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే నినాదాన్ని వినిపించనున్నారు. ఇప్పటి వరకూ లోకేష్ తెరవెనుకే రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ సైకిల్ యాత్రతో చంద్రబాబు వారసుడిగా.. ప్రత్యక్ష రాజకీయ సమరంలోకి దిగబోతున్నారు.

  • Loading...

More Telugu News