: శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై వాస్తవాలు నిర్ధారించండి: సీబీఐ కోర్టు


ఐఏఎస్ అధికారిణి, ఓఎంసీ కేసు నిందితురాలు శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై వాస్తవాలేంటో నిర్ధారించాలని చంచల్ గూడ జైలు సూపరింటెండెంటుకు సీబీఐ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల వైద్యులతో ఆమె ఆరోగ్యస్థితిపై కచ్చితమైన నివేదిక తయారుచేయించి ఇవ్వాలని కోర్టు సూచించింది. ఈ సందర్భంగా కోర్టు శ్రీలక్ష్మి మధ్యంతర బెయిల్  పొడిగింపు పై విచారణను మళ్లీ ఈ నెల 25కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News