: వీవీఎస్ లక్ష్మణ్ ఖాతా నుంచి లక్షలు కొల్లగొట్టిన ఆగంతుకుడు
ప్రముఖ మాజీ టెస్ట్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కు చెందిన బ్యాంకు ఖాతాను కోల్ కత్తాకు చెందిన ఇజాజుల్ అనే వ్యక్తి హ్యాక్ చేశాడు. అంతేకాకుండా, నెట్ బ్యాంకింగ్ ద్వారా లక్ష్మణ్ అకౌంట్ నుంచి రూ. 10 లక్షలు కొల్లగొట్టాడు. జరిగిన విషయాన్ని గమనించిన లక్ష్మణ్ వెంటనే సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, ఇజాజుల్ ను హైదరాబాద్ తీసుకురావడానికి సైబరాబాద్ క్రైం టీమ్ కోల్ కత్తా బయలుదేరింది.