: ఆయుర్దాయాన్ని ఇలా కూడా పెంచుకోవచ్చు!


నిద్రాతురాణాం న సుఖం న శయ్యా... అన్నారు పెద్దలు!
అంటే నిద్రముంచుకొచ్చినప్పుదు పడుకోవడానికి మంచి సుఖమైన ప్రదేశం కానీ, మంచి పరుపు కానీ అవసరం లేదు.
కటికనేల మీద పడుకున్నా నిద్రపట్టేస్తుంది. అలాంటి సుఖనిద్ర ఆరోగ్యానికి ఎంతో మేలని ఎప్పటి నుంచో మన పెద్దలు కూడా చెబుతూ వస్తున్నారు.
ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా మరోసారి అదే విషయాన్ని సెలవిస్తున్నారు.
క్రమం తప్పకుండా వేళకి హాయిగా సుఖనిద్ర పొందడం ఆరోగ్యానికి మంచిదే కాదు, దాని వల్ల మన ఆయుర్దాయం కూడా గణనీయంగా పెరుగుతుందట. ముఖ్యంగా పురుషులలో ఈ మార్పు బాగా కనిపిస్తుందని ఆస్ట్రేలియాలోని మొనాష్ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు.
నిద్రలేమి వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మధుమేహం, అజీర్ణం, ఆకలితగ్గడంతో బాటు గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయని ఈ పరిశోధకులు తేల్చారు.
మహిళల విషయానికి వస్తే, సుఖనిద్రతో బాటు, విటమిన్ బి-6 సమృద్ధిగా వుండే ఆహారం కూడా తీసుకోవాలట. కాబట్టి, ప్రతి రోజూ వేళకు నిద్రపోవడం అలవాటు చేసుకుంటే, మన ఆయుష్షు పెంచుకోవడం అన్నది మన చేతుల్లోనే వుంటుందన్న మాట!

  • Loading...

More Telugu News