: 'సైకిల్' నచ్చక 'కారు' ఎక్కిన టీడీపీ నేత
మహబూబ్ నగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పీ చంద్రశేఖర్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. త్వరలోనే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నానని ఆయన వెల్లడించారు.
ఇటీవల కొంతకాలంగా చంద్రశేఖర్ పార్టీ వీడనున్నారని సంకేతాలు ఉన్నాయి. గులాబీనేతలతో మంతనాలు, ఇవాళ కేసీఆర్ తో ఫోన్ సంభాషణతో చివరిగా చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీతో తెగతెంపులు చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు.