: కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేస్తాం: నితీష్ కుమార్
కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా లోక్ సభ ఎన్నికలకు ముందు భావసారూప్యత గల పార్టీలతో సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేయనున్నట్టు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, సంకీర్ణ కూటమి ఏర్పాటు చేసే దిశగా వామపక్ష నేతలు చురుగ్గా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వారికి జేడీయూ మద్దతు ఇస్తుందని నితీష్ కుమార్ స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల్లో వామపక్ష పార్టీలు పొత్తులు కుదుర్చుకుంటున్నాయని, సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నాయని ఆయన స్పష్టం చేశారు. అయితే, ప్రతిపాదిత కూటమికి ధర్డ్ ఫ్రంట్ లాంటి పేరు పెట్టలేదని ఆయన తెలిపారు.