: ఈ రోజు తిరుమలేశుని హుండీ ఆదాయం రూ. 1.55 కోట్లు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఆలయానికి ఇవాళ (శుక్రవారం) హుండీ ఆదాయం ఒక కోటి 55 లక్షల రూపాయలు వచ్చింది. శ్రీవారి దర్శనానికి 16 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం, కాలి నడకన వచ్చే భక్తుల దివ్య దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.