: దిగ్విజయ్ తీరు సరికాదు... మేం చేసేది మేం చేస్తాం: మంత్రి ఏరాసు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ 'మీరేం చెప్పినా.. మాకు నచ్చినదే చేస్తాం' అనేలా దిగ్విజయ్ మాట్లాడడం సరికాదని ఏరాసు సూచించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర నేతలంతా ఢిల్లీ వెళ్లి ఒక రోజు మౌన దీక్ష చేస్తామని ఆయన చెప్పారు. మౌన దీక్షా స్థలి నుంచి పాదయాత్రగా రాష్ట్రపతి వద్దకు వెళ్లి వినతి పత్రం అందజేయనున్నట్లు ఏరాసు తెలిపారు.