: ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వం కూడా కారణమే: మంత్రి బొత్స
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) నష్టాలకు ప్రభుత్వం కూడా కారణమని రవాణా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆర్టీసీ చేసిన సమ్మె వల్లే సంస్థ బాగా నష్టపోయిందన్నారు. కార్మికులకు ఇచ్చిన మధ్యంతర భృతి (ఐఆర్) వల్ల ఏడాదికి 380 కోట్ల రూపాయల భారం పడుతోందని ఆయన అన్నారు. ఆర్టీసీకి స్వయం ప్రతిపత్తి ఉండాలని.. లేకుంటే ప్రభుత్వం ఆదుకోవాలని బొత్స తెలిపారు. ఆర్టీసీ చేసిన వరుస సమ్మెల వల్ల సంస్థకు నష్టం బాగా వాటిల్లిందని ఆయన చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన 27 శాతం మధ్యంతర భృతిని కాంట్రాక్టు కార్మికులకు కూడా వర్తింపజేయడంతో అదనపు భారం పడుతోందని ఆయన చెప్పారు.