: ముషారఫ్ కు కోర్టు అరెస్ట్ వారెంట్


పాకిస్థాన్ మాజీ అద్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు ఇస్లామాబాదులోని ప్రత్యేక కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇటీవల గుండెపోటుకు గురయిన ఆయనను తదుపరి చికిత్స కోసం విదేశాలకు వెళ్లాలని పాక్ మిలటరీ ఆసుపత్రి వైద్యులు సూచించారు. దాంతో, ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దేశద్రోహం కేసులో గతేడాది నుంచి విచారణ ఎదుర్కొంటున్న ముషారఫ్ కు అనారోగ్యం కారణంగా ఈ నెలలో కొన్ని రోజుల మినహాయింపు ఇచ్చింది. ఆ గడువు ముగిసినా విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం ఈ రోజు వారెంట్ ఇచ్చింది.

  • Loading...

More Telugu News