: శ్రీకాకుళం జిల్లాలో 19,28,527 ఓటర్ల నమోదు
శ్రీకాకుళం జిల్లాలో ఓటర్ల తుది జాబితాను అధికార యంత్రాంగం విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 19,28,527 మంది ఓటర్లుగా నమోదయ్యారు. 2,540 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచామని జిల్లా అధికారులు వెల్లడించారు. గత ఏడాది జనవరి 15 నాటికి శ్రీకాకుళం జిల్లాలో ఓటర్ల సంఖ్య 17,77,390 మంది ఉన్నారు. ఇప్పుడు అత్యధికంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో 2,19,009 మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా.. అత్యల్పంగా పాలకొండ నియోజకవర్గంలో 1,64,050 మంది నమోదయ్యారు. ఈసారి పురుషుల కంటే కూడా మహిళా ఓటర్లు అధికంగా ఉండటం విశేషం. ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ ఆదేశాల మేరకు జనవరి 31 తేదీ నాటికి ఓటర్ల తుది జాబితాను తయారుచేసిన అధికార యంత్రాంగం.. జాబితాను ప్రచురించి పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు.