: ఆ కార్లు సురక్షితం కాదు: గ్లోబల్ వాచ్ డాగ్
భారతదేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ప్రజాదరణ పొందిన మోడల్ కార్లు సురక్షితం కాదని అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ వాచ్ డాగ్ తెలిపింది. లండన్ కి చెందిన గ్లోబల్ న్యూ కార్ ఎసెస్ మెంట్ ప్రోగ్రామ్ కింద జరిపిన క్రాష్ పరీక్షలో గతేడాది ఎక్కువగా అమ్ముడైన టాటా నానో, హ్యుండయ్ ఐ10, మారుతీ సుజుకి ఆల్టో 800, ఫోర్డ్ ఫిగో, వోక్స్ వ్యాగన్ పోలో కార్లు విఫలమయ్యాయి. భారత్ లో తయారు చేసిన మోడళ్లను పరీక్షించారు. ఈ పరీక్షలో అత్యంత ఆదరణ, ప్రాధమిక స్థాయి కార్లను మాత్రమే ఎంచుకున్నారు. ఈ మోడళ్లకు చెందిన కార్లు ప్రమాదాల బారిన పడితే తీవ్ర స్థాయిలో గాయపడతారని గ్లోబల్ వాచ్ డాగ్ తెలిపింది.