: ధోనీ హ్యాట్రిక్ ఫోర్లు.. భారత్ హ్యాట్రిక్ విజయాలు
మొహాలీ టెస్టులో ఆఖర్లో కాసింత ఉత్కంఠ నెలకొన్నా కెప్టెన్ ధోనీ వరుసగా మూడు ఫోర్లు కొట్టి భారత్ ను గెలుపు తీరాలకు చేర్చాడు. చివర్లో బంతులు తక్కువగా ఉన్న స్థితిలో ధోనీ దూకుడు ప్రదర్శించడం టీమిండియాకు లాభించింది. దీంతో భారత్ ఈ మ్యాచ్ లో ఆసీస్ పై 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సెంచరీ హీరో శిఖర్ ధావన్ కు లభించింది. ధావన్ తొలి ఇన్నింగ్స్ లో 187 పరుగులు చేశాడు.
తద్వారా సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుంది. కంగారూలతో నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ తొలి రెండు టెస్టుల్లోనూ జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. కాగా, ఆసీస్ పై భారత్ కిదే తొలి హ్యాట్రిక్ విజయం. మునుపెన్నడూ కంగారూలను వరుసగా మూడు టెస్టుల్లో భారత్ చిత్తుచేయలేకపోయింది. ఇక, నాలుగో టెస్టు ఈ నెల 22 న ఢిల్లీలో మొదలవనుంది.