: ముంబై దాడులు పునరావృతమవుతాయేమో!: కోస్ట్ గార్డ్ చీఫ్
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంపై 26/11 దాడుల తరువాత తీరప్రాంత భద్రతను గణనీయంగా బలోపేతం చేసినట్టు కోస్ట్ గార్డ్ చీఫ్ ఏజీ తప్లియాన్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ మరోసారి సముద్ర మార్గంలో అలాంటి దాడి జరిగే అవకాశం ఉందని తెలిపారు. తాము ఒకలా ఆలోచిస్తే, ఉగ్రవాదులు మరోలా ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. ముంబై తీరం చేరేందుకు తీవ్రవాదులు డింగీ అనే చిన్న బోటును వినియోగించారని, 20 మీటర్ల కన్నా చిన్న బోట్లపై ఉన్న మత్స్యకారులను కూడా అప్రమత్తం చేశామని ఆయన వివరించారు.