: సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ఎఫ్ఏసీ అధికారాలు


సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ఖాళీగా ఉన్న ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల ఎఫ్ఏసీ అధికారాలు ఇచ్చేందుకు పాఠశాల విద్యా కమిషనర్ అంగీకరించారని పీఆర్ టీయూ అధ్యక్షులు పి.వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి సి. సరోత్తమ్ రెడ్డి తెలిపారు. 2013 మే నెలలో జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో ఉత్తర్వులు పొంది రిలీవ్ కాకుండా పాత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఈ విద్యా సంవత్సరం చివరి పని దినం నాడు విడుదల చేయడానికి ఆదేశాలు జారీ చేసేందుకు అంగీకరించారని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News