: అన్న అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ... చెల్లికి అత్యాచారం శిక్ష!


దాయాది దేశం పాకిస్థాన్ లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంకా చాలామంది భయంకరంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, పాక్ లోని రదీవాలా గ్రామ పంచాయతీ ఓ మహిళకు దారుణమైన శిక్ష విధించింది. వివాహితుడైన అజ్మల్ అనే వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడట. ఈ విషయాన్ని ఆమె భర్త గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకొచ్చాడు. విషయాన్ని అంతా విన్న పంచాయతీ పెద్దలు 'కుక్క కాటుకు చెప్పు దెబ్బ' అనే సామెత మాదిరిగా.. అజ్మల్ సోదరి (నలభై ఏళ్లు)పై అత్యాచారం చేయాలంటూ తీర్పు చెప్పింది. దాంతో, ఆమెపై కొంతమంది వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారని పాక్ లోని డాన్ పత్రిక పేర్కొంది. ఈ ఘటన ఈ నెల 24న చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News