: అనంతపురంలో గుండెపోటుతో ట్రైనీ కానిస్టేబుల్ మృతి
అనంతపురం జిల్లాలో పోలీస్ శిక్షణలో ఉన్న ట్రైనీ కానిస్టేబుల్ సుబ్బారావు గుండెపోటుతో మృతి చెందాడు. అయితే, అధికారుల వేధింపులే కానిస్టేబుల్ మృతికి కారణమంటూ ట్రైనీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. సుబ్బారావు మరణంపై ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తూ.. పోలీస్ శిక్షణ కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై ఎస్పీ వెంటనే స్పందించాలంటూ వందలాది మంది ట్రైనీ సిబ్బంది నినాదాలు చేస్తూ ఎస్పీ కార్యాలయానికి ర్యాలీ నిర్వహించారు. మృతుడు సుబ్బారావు తూర్పుగోదావరి జిల్లా వాసి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.