: పోలవరం పేరుతో భద్రాచలం సీమాంధ్రలో కలపొద్దు: పొంగులేటి


పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే నెపంతో భద్రాచలం డివిజన్ ను సీమాంధ్రలో కలపొద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాదులో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు కాంతారావు, మిత్రసేన, ఎమ్మెల్సీ పొంగులేటి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన బిల్లుపై ముఖ్యమంత్రి తిరస్కార తీర్మానం ఆమోదం పొందినా వచ్చిన నష్టమేదీ లేదని అన్నారు. తెలంగాణ ప్రక్రియ ఎవరి ఆమోదాలు, తిరస్కారాలతో సంబంధం లేకుండా జరిగిపోతుందని అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీలను కోరేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులంతా ఢిల్లీ వెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నమూనాను మారిస్తే ముంపు గ్రామాలు తగ్గుతాయని తెలంగాణ నేతలు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News